ప్రస్తుత కాలంలో సినిమా ఎంత పెద్ద హిట్టైనా నెల రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడటం గగనమైపోయింది. వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసి ఫస్ట్ వీక్ లోనే సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా మెజారిటీ సందర్భాల్లో ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అయితే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మాత్రం ఒక థియేటర్ లో ఏకంగా 365 రోజులు పూర్తి చేసుకుంది.
అవనిగడ్డ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్ లో వాల్తేరు వీరయ్య మూవీ ప్రదర్శితం కావడంతో పాటు అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకుంది. ఈ రికార్డ్ తన దృష్టికి రావడంతో చిరంజీవి స్పందించడంతో పాటు తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ కు కారణం బాబీ అని అలాగే నా తమ్ముడు రవితేజ, మైత్రీ నిర్మాతలు అని పేర్కొన్నారు. వీరందరూ లేకపోతే సినిమా లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుత కాలంలో ఒక సినిమా 365 రోజుల పాటు ప్రదర్శించబడటం సాధారణ విషయం కాదని వాల్తేరు వీరయ్య సినిమాకు ఈ ఘనత దక్కడం సంతోషంగా ఉందని చిరంజీవి కామెంట్లు చేశారు. అదే సమయంలో చిరంజీవి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. అనిల్ సినిమాకు చిరంజీవి పారితోషికం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. చిరంజీవి ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!