Chiranjeevi: బాల్యాన్ని గుర్తు చేసుకుని షాకింగ్ విషయాలు తెలిపిన చిరంజీవి!

‘జాతి రత్నాలు’తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న దర్శకుడు అనుదీప్ కెవి.. కథ, స్క్రీన్‌ప్లే అందించిన లేటెస్ట్ మూవీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. సెప్టెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు హాజరవుతున్న చిరు మైక్ పట్టుకుంటే సుమారు పావు గంట పాటు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే.

అదే విధంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తన బాల్యంలో జరిగిన ఓ వింత సంఘటన గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు చిరు. ఎన్టీఆర్ సినిమాకి వెళ్తే తన నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారు అంటూ చిరు చెప్పడం అందరికీ షాకిచ్చింది. అయితే ఆయన్ని అలా కొట్టుకుంటూ తీసుకెళ్లింది మరెవరో కాదు ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు గారు. చిరంజీవి మాట్లాడుతూ.. ” ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చూసిన అనుభవం నాకు కూడా ఉంది.

ఏవీఎం వారి నిర్మాణంలో ఎన్టీఆర్ గారు నటించిన ‘రాము’ చిత్రాన్ని నెల్లూరు లో మా చుట్టాలు అబ్బాయితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వెళ్ళాను.మా చుట్టాలబ్బాయి మమ్మల్ని నేల టికెట్ కోసమని లైన్లో నించో పెట్టాడు. అప్పుడు నాగబాబుని తీసుకొని క్యూలో నడుస్తుంటే మధ్యలో క్యూ ఆగిపోయింది. ఇరుకు గోడలు. ఊపిరాగిపోయినంత పనైయింది.

ఏదో రకంగా టికెట్ తీసుకుని బయటికి వస్తే.. ఎదురుగా మా నాన్న గారు కనిపించారు. వెనుక అమ్మ వుంది. అప్పుడు ఆయన నేల టికెట్ లో సినిమా చూస్తావా ? అంటూ అక్కడున్న కొబ్బరి మట్ట తీసికొని చెత్త కింద కొట్టారు. నడి రోడ్డు పై మమ్మల్ని ఆయన కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పటికీ ‘రాము’ సినిమా పేరు వింటే వణుకు పుడుతుంది. ఇదీ నా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం” అంటూ చెప్పుకొచ్చారు చిరు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus