Chiranjeevi: మై డియర్ దేవా అంటూ సలార్ రివ్యూ ఇచ్చిన చిరు!

  • December 23, 2023 / 04:27 PM IST

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతోమంది ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా పట్ల ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా బెనిఫిట్ షోస్ ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు సినిమా చూసి అనంతరం సినిమాపై వారి రివ్యూలను ఇస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు సలార్ సినిమాపై వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సలార్ సినిమాకు తన స్టైల్ లో రివ్యూ ఇవ్వడమే కాకుండా హీరో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌లో మై డియర్ దేవా (రెబెల్ స్టార్ ప్రభాస్).. నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

సలార్: సీజ్‌ఫైర్ మూవీతో మీరు బాక్సాఫీస్‌ను తగలబెట్టేశారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి అభినందనలు. మీరు సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో ఎంతో సక్సెస్ సాధించారు అంటూ ఈ సందర్భంగా చిరు (Chiranjeevi) సలార్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య కొనసాగుతూ ఉండే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే ప్రధాన అంశం ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడు పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ సినిమా ద్వారా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus