Meghana Raj: రేపటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు: మేఘన రాజ్

కన్నడ దివంగత సినీ నటుడు చిరంజీవి సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే చిరంజీవి సర్జా నటి మేఘన రాజ్ ను 2018 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులను చూసి కాలం కూడా పూర్వ లేకపోయింది కాబోలు.

వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2020 జూన్ 7వ తేదీ గుండెపోటుతో చిరంజీవి సర్జా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా పెళ్లయిన రెడ్డి సంవత్సరాలకే భర్త మృతి చెందడంతో ఈమె అయోమయ స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఐదు నెలల గర్భిణీ కావడం విశేషం. ఈ విధంగా అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడమే కాకుండా కడుపులో తన భర్త ప్రతిరూపాన్ని మోస్తూ తనపై ఎన్నో ఆశలు పెట్టుకొని జీవితం గడుపుతుంది.

మేఘన రాజ్ మగ బిడ్డకు జన్మనిచ్చి తన కొడుకులోనే తన భర్త ప్రతిరూపం చూసుకుంటూ కాలం వెళ్ళ తీస్తుంది.ఇకపోతే తన భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడిన మేఘనా రాజ్ పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంది అలాగే పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీ అయ్యారు.ఈ క్రమంలోనే ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందనీ పెద్ద ఎత్తున రెండవ పెళ్లి గురించి వార్తలు షికారులు చేస్తున్నాయి. ఇలా తన రెండవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలు స్పందించిన మేఘన రాజ్ క్లారిటీ ఇచ్చారు.

తన భర్త తనకి ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేవాడు నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుందో నువ్వు ఆలోచించకు నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యి అంటూ చెప్పేవాడు అయితే ప్రస్తుతం నా రెండో పెళ్లి గురించి చాలా వార్తలు వస్తున్నాయి కొందరు పెళ్లి చేసుకోని సలహా ఇస్తుండగా మరి కొందరు కొడుకుని చూసుకుంటూ ఉండు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే రెండో పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడు ప్రశ్న వేసుకోలేదు రేపు ఏం జరుగుతుందిఅని నేను ఎప్పుడూ ఆలోచించలేదు అంటూ ఈ సందర్భంగా ఈమె రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus