Chiranjeevi, Mahesh Babu, Prabhas: ఓకే ఫ్రేమ్ లో మహేష్ ప్రభాస్ చిరు!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా ఇబ్బంది కలుగజేస్తున్న ఆంధ్రప్రదేశ్ టికెట్ల రేట్లను విషయంపై పలువురు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కలవబోతున్న విషయం తెలిసిందే. సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు పలువురు దర్శకులు కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపి ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అనుకుంటున్నారు. గతంలో చాలాసార్లు సినిమాటోగ్రాఫి మినిష్టర్ పేర్ని నానితో కలిసి చిత్ర ప్రముఖులు డిస్ట్రిబ్యూటర్స్ చర్చలు జరపడం జరిగింది.

Click Here To Watch

కానీ ఆ చర్చలకు ఏ మాత్రం ఫలితం దక్కలేదు. కానీ ఈసారి మాత్రం టాలీవుడ్ లోని అగ్ర హీరోలు దర్శకులు అందరూ కూడా టికెట్ల రేట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక చార్టెడ్ ఫ్లైట్ లో వెళుతుండడం విశేషం. ఇక అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకే అందిస్తున్నట్లు ఉండగా ప్రభాస్ కొరటాల శివ ఫొటోకు స్టిల్స్ ఇస్తున్నారు. ఇక పక్కనే రాజమౌళి కూడా ఉన్నాడు. వీరి కలయికను చూసి చాలా కాలం కావడంతో అభిమానులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ యూనిటీతోనే అందరూ హీరోలు ఉండాలని భావిస్తున్నారు. ఏదేమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఓకే ఫ్రేమ్ లో ఉండడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక రాజమౌళి కొరటాల శివ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హీరోలు దర్శకులు నిర్మాతలు చర్చించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక నందమూరి బాలకృష్ణకు మెగాస్టార్ ప్రత్యేకంగా ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన స్పంధించలేదని తాజ్ వస్తోంది. మరి ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus