Chiranjeevi: కమర్షియల్ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ ఇంద్ర.. చిరు చెప్పిన విషయాలివే!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  , బి.గోపాల్ (B. Gopal)  కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంద్ర (Indra)  మూవీ 2002 సంవత్సరంలో విడుదలై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. ఈ సినిమాలో చిరంజీవి లుక్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి మాట్లాడుతూ ఇంద్రసేనారెడ్డి అని అంటుంటూనే ఒళ్ళు గగుర్పొడుస్తోందని తెలిపారు.

Chiranjeevi

రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమాకు ఉన్న పవర్ అలాంటిదని చిరంజీవి పేర్కొన్నారు. ఇంద్ర మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం కథ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లంతా మనస్సు పెట్టి శ్రద్ధగా వర్క్ చేశారని చిరంజీవి తెలిపారు. ఆ కారణం వల్లే ఇప్పటికీ ఇంద్ర సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని ఆయన కామెంట్లు చేశారు. ఇంద్ర సినిమాలో ఏ సీన్ నుంచి చూడడం మొదలుపెట్టినా చివరి వరకు చూస్తామని ఆయన పేర్కొన్నారు. అదే ఇంద్ర సినిమాకు ఉన్న గొప్పదనం అని మెగాస్టార్ తెలిపారు. నా సినిమాలలో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ మూవీ ఇంద్ర అని ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ ఇంద్ర అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, ఆర్టిస్టుల నటన, పాటలు అన్నీ అద్భుతం అని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) పాన్ ఇండియా హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘తంగలాన్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus