Chiranjeevi: సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను.. నా ‘గాడ్ ఫాదర్’ సినిమా 4 సార్లు చూశారు: చిరంజీవి

  • October 29, 2022 / 11:15 AM IST

టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.. మెగాస్టార్ చిరంజీవి పై ‘శూన్యం నుండి శిఖరాగ్రాలు’ అంటూ ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. దాని ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి చిరంజీవి వచ్చి తన మనసులోని భావాలను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘మేమంతా కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటాము. ఈరోజు ఇక్కడికి నేను ఓ స్టార్ గా రాలేదు. ఓ కుటుంబ సభ్యుడిగా వచ్చాను.

నా గురించి ప్రభు ఎంత గొప్పగా చెప్పాడు, నన్ను ఎంతగా కీర్తించాడు అన్నది నాలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. నన్ను క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది అనడంలో సందేహం లేదు. మురళీమోహన్ గారు చెప్పినట్టు ఆరోగ్యకరమైన జర్నలిజం ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే ఉంది. గతంలో మేము చెన్నై లో ఉన్నప్పుడు షూటింగ్లు చేస్తున్నప్పుడు రాధా, విజయశాంతి వంటి వారు షూటింగ్ స్పాట్ కు వెళ్తే మూడౌట్లో ఉండేవారు. ఎందుకంటే అక్కడి పత్రికల్లో హీరోయిన్ల గురించి వాళ్ళ పర్సనాలిటీల గురించి చాలా ఘోరంగా రాసేవారు అని వాళ్ళు ఫీలయ్యే వాళ్ళు.

అలాంటి పరిస్థితి మన తెలుగులో లేదు. ఉన్నది ఉన్నట్టు రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది పక్షపాతంతో వేరే విధంగా రాయొచ్చు. అయితే అది కూడా మమ్మల్ని సరైన దారిలో పెట్టేదిగా నేను భావిస్తాను. ప్రభు నా గురించి ‘శూన్యం నుండి శిఖరాగ్రాలు’ అంటూ వర్ణిస్తూ బుక్ రాయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇంట్లో 5 ఏళ్ళు, 9 ఏళ్ళ మనవరాళ్లు నాకు ఉన్నారు.

అయితే వాళ్ళు ఎంతసేపు చరణ్, వరుణ్ ఇలా మా ఇంట్లో ఉండే ఇప్పటి జనరేషన్ హీరోల పాటలే పెట్టమని అడిగేవారు. అప్పుడు నాకు ఎక్కడో కాలుతూ ఉండేది. నా గురించి ఇప్పటి జనరేషన్ కు ఎలా తెలుస్తుంది అని నాకు అనిపించేది. నా గురించి నేనే చెప్పుకోవాల్సిన దుస్థితి నాకు వచ్చింది. అది కూడా నా ఇంట్లోనే వచ్చింది. సరే వాళ్ళని లాక్ డౌన్ టైంలో బలవంతంగా కూర్చోబెట్టి నా ఆల్బమ్స్ లో బెస్ట్ అనుకున్నవి ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ వంటివి చూపించాను.

నా మనవరాళ్లు నన్ను అదృష్టం కొద్దీ భయ్యా అంటారు. ‘భయ్యా అది నువ్వేనా అని నన్ను అడిగారు.. అవునమ్మా అది నేనే.. మీ అమ్మ, నాన్న పుట్టకముందు నుండి అది నేనే’ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాడిని. దీంతో వాళ్ళు మొత్తం నా ఆల్బమ్స్ చూడటం మొదలుపెట్టారు. మొన్నొచ్చిన నా ‘గాడ్ ఫాదర్’ సినిమాని 4 సార్లు చూశారు. ఇంట్లో కాబట్టి నా గురించి నేను చెప్పుకున్నాను. బయటవాళ్ళకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్న టైంలో ప్రభు నా గురించి ఇలా బుక్ రాసి విడుదల చేయడం.. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus