Chiranjeevi: మరో ‘చంటబ్బాయి’కి మీరు రెడీనా? ఎప్పుడు ప్రారంభిస్తారంటే?

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా ప్రొడ్యూస్‌ చేయాలని చాలా మంది నిర్మాతలు ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ముందే చెప్పి… త్వరగా ఛాన్స్‌ ఇప్పించండి బాస్‌ అని అడిగేశారు కూడా. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఒకరు. చిరంజీవి హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్‌ చేయాలనేది ఆయన చిరకాల కోరిక. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది అనేది లేటెస్ట టాక్‌. అది కూడా చిరు ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ లాంటి కథతో అంటున్నారు.

చిరంజీవి ఆ మధ్య వరుసగా సినిమాలు ఓకే చేసి వావ్‌ అనిపించారు. సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు ఓకే చెప్పాడు. అయితే ఏమైందో మళ్లీ ఇప్పుడు కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇటీవల ఓకే చేసిన సినిమాల ఫలితాలే దానికి కారణం అని చెప్పొచ్చు. ఆ విషయం పక్కనపెడితే దిల్ రాజు నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమా ఓకే చేశారు అంటున్నారు. దీనికి దిల్‌ రాజు ఆస్థాన స్టార్‌ డైరక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకుడు అట.

ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఆ సినిమాకు ‘విశ్వంభర’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆ సినిమా తర్వాత చిరంజీవి అనిల్‌ రావిపూడి సినిమా చేస్తారని టాక్‌. ఈ మేరకు పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రానికి తగ్గ కథను ఆయన రెడీ చేశారట. గతంలో చిరంజీవి చేసిన భారీ విజయం అందుకున్న ‘చంటబ్బాయ్‌’ తరహాలో ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ఈ మేరకు త్వరలో చిరును కలసి అనిల్‌ రావిపూడి కథను ఫైనల్‌ చేసుకుంటారని ఓ టాక్‌ నడుస్తోంది. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి దాదాపు రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా అందుకుంటారు అని ఓ టాక్‌ నడుస్తోంది. ఆయన లేటెస్ట్‌గా చేస్తున్న సినిమా కంటే దీనికి రూ. 10 కోట్లు అదనంగా ఇస్తున్నారట.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus