మెగాస్టార్ – మాటల మాంత్రికుడు …ఇద్దరూ వెనకడుగు వేస్తున్నారే…!

  • September 18, 2020 / 09:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ … వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. దాని తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్, అలాగే వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ , బాబీ డైరెక్షన్లో మరో సినిమా … ఇలా వరుస ప్రాజెక్ట్ లు చెయ్యడానికి రెడీ అయ్యారు. అయితే మధ్యలో త్రివిక్రమ్ తో కూడా సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు.

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తానని.. దానికి డి.వి.వి దానయ్య నిర్మాత అని అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చిరు 4 ప్రాజెక్ట్ లతో బిజీ. ఇక త్రివిక్రమ్ … ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. దానికి ఏడాది టైం పడితే కనుక .. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. కుదిరితే మహేష్ బాబు తో కూడా త్రివిక్రమ్ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉంది.

ఇవన్నీ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ తో లేదా వెంకటేష్ తో కూడా త్రివిక్రమ్ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నిర్మాత దానయ్య కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రభాస్ ప్రాజెక్ట్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే చిరు- త్రివిక్రమ్ ల సినిమా ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమవుతుంది. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో…!

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus