త్రివిక్రమ్ తో మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్.!
- December 1, 2016 / 06:22 AM ISTByFilmy Focus
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. అ.. ఆ మూవీ తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం ఖరారు అయింది. “దేవుడే దిగివచ్చినా..” అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్న ఈ ఫిల్మ్ కి కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి అనిరుధ్ పాటలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిరు తన 150 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రేపటి నుంచి మొదలు కానున్న సాంగ్ చిత్రీకరణతో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆ తర్వాత అల్లు అరవింద్, అశ్వినీదత్ సంయుక్తంగా చిరు 151 వ మూవీ ని నిర్మించనున్నారు. ఇది బోయపాటి శ్రీను డైరక్షన్లో తెరకెక్కనుంది. అనంతరం మెగాస్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్లో 152 చిత్రం మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పారు. రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ చిరుని కలిసి మూడు గంటలపాటు కథని వినిపించారని, అది నచ్చడంతో మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో జై చిరంజీవి మూవీకి త్రివిక్రమ్ మాటలు అందించారు. ఈ సారి డైరక్షన్ చేయనున్నారు. ఈ చిత్రంపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















