దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోం ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రోమోకి సంబంధించి ఓ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమోకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనే విషయంపై చిత్రబృందం నోరు మెదపడం లేదు.
‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇప్పటికే రెండు టీజర్లు వచ్చాయి. ముందుగా రామ్ చరణ్ టీజర్ రాగా.. ఆ తరువాత ఎన్టీఆర్ టీజర్ ని రిలీజ్ చేశారు. చరణ్ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. ఎన్టీఆర్ టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలను చూపిస్తూ రిపబ్లిక్ డేకు ఓ స్పెషల్ టీజర్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ టీజర్ కే చిరు వాయిస్ ఓవర్ అందిస్తారనే ప్రచారం సాగుతోంది. రాజమౌళి సినిమాలకు చిరంజీవిని లింక్ పెడుతూ గతంలో కూడా ఇలాంటి వార్తలొచ్చాయి.
‘బాహుబలి2’ సినిమా చిరంజీవి వాయిస్ తో మొదలవుతుందని అన్నారు. కానీ అందులో నిజం లేదని రాజమౌళి వెంటనే క్లారిటీ ఇచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ ప్రోమో విషయంలో మాత్రం ఎలాంటి ఖండనలు రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఈ వార్తలు నిజమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!