Chiranjeevi vs Prabhas: 2023 సంక్రాంతి బరిలోనే చిరు- బాబీ మూవీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మెగా 154′ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయ్యింది.’మైత్రీ మూవీ మేకర్స్‌’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. ‘కలుద్దాం… సంక్రాంతి కి జనవరి 2023,’ అని ఓ పోస్టర్ ను కొద్దిసేపటి ముందు మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రంతో పాటు ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారు చిరు. ఇందులో ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ‘భోళా శంకర్’ కూడా తొందరలోనే షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.మరి ఆ చిత్రాల రిలీజ్ డేట్ లు ఎందుకు ఇంకా ప్రకటించలేదు అనే అనుమానం కూడా మెగా అభిమానుల్లో ఉంది. అది పక్కన పెడితే… 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ నెలకొనేలా ఉంది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో పాటు విజయ్- వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారసుడు’ చిత్రం అలాగే వైష్ణవ్ తేజ్ – శ్రీలీల కాంబినేషన్లో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి.. 2023 సంక్రాంతి బరిలో పోటీపడనున్నాయి. ఇప్పుడు ఈ రేస్ లో చిరు- బాబీ ల సినిమా కూడా చేరడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. వైష్ణవ్, విజయ్ సినిమాలు వాటి మార్కెట్ కు తగ్గట్టు అవి క్యాష్ చేసుకుంటాయి. వాటితో పెద్దగా ఇబ్బంది లేదు.

అయితే పోటీ మొత్తం చిరు – ప్రభాస్ ల సినిమాల మధ్యే ఉంటుంది. ఓ రకంగా చిరు- బాబీ ల మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే ఇది పక్కా మాస్ మూవీ. ప్రభాస్ … ‘ఆదిపురుష్’ అనేది మైథలాజికల్ మూవీ. ఇప్పటి ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూస్తారన్న గ్యారెంటీ లేదు.ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా ఆ సినిమా పై ఆసక్తి సన్నగిల్లింది.

అయితే 2023 సంక్రాంతి దగ్గరకి వచ్చేసరికి ఈ సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఇవే సినిమాలు కనుక ఆ టైంకి రిలీజ్ అయితే చిరు బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడం గ్యారెంటీ అనే చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus