Chiranjeevi, Ram Charan: ఆ విషయంలో చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం తన తండ్రి చిరంజీవి అని చెప్పాలి. రామ్ చరణ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్న కారణంతోనే చిన్నప్పటినుంచి ఈయనని ప్రతి ఒక్క విషయంలోనూ చాలా క్రమశిక్షణగా పెంచారట.

ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోగా ప్రతి ఒక్క విషయంలోనూ ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అనే జాగ్రత్తలను కూడా తెలియజేశారట ఇక హీరోలు అన్న తర్వాత ఫిట్నెస్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ దివంగత నటుడు శ్రీహరి వద్దకు రామ్ చరణ్ ను ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం పంపించే వారట అయితే శ్రీహరి దగ్గరికి మొదట్లో వెళ్లినటువంటి రామ్ చరణ్ ఆయన పెట్టే టార్చర్ భరించలేకపోయారట.

ఇలా శ్రీహరి వద్దకు రెండు రోజులు వెళ్ళిన తర్వాత మూడో రోజుకు ఆయన పెట్టే టార్చర్ భరించలేక రామ్ చరణ్ చిరంజీవి వద్దకు వెళ్లి నేను శ్రీహరి గారి వద్దకు వెళ్ళనని తేల్చి చెప్పారట నేను ఆయన వద్దకు వెళ్తే ఆయన పెట్టే టార్చర్ భరించలేక చస్తాను అంటూ రామ్ చరణ్ తన తండ్రి వద్దకు వెళ్లి తన ఇబ్బందుల గురించి చెప్పడమే కాకుండా తన తండ్రిని బ్లాక్మెయిల్ చేశారని తెలుస్తుంది.

ఇలా శ్రీహరి వద్దకు వెళ్లనని రామ్ చరణ్ తేల్చి చెప్పడంతో చిరంజీవి ఏమి చేయలేక రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫిట్నెస్ ట్రైనర్ ను ఇంటికి పిలిపించి స్వయంగా రామ్ చరణ్ కు శిక్షణ ఇప్పించారని తెలుస్తుంది. శ్రీహరి వద్దకు ఫిట్నెస్ ట్రైనింగుకు వెళ్లాలి అంటే అప్పటినుంచి రాంచరణ్ కు ఏదో తెలియని భయం ఉండేదట. ఇక హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఇప్పటికీ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus