ఒకవైపు ఆచార్య అంటూ మెగాస్టార్ స్ట్రయిట్ మేకింగ్ సినిమాతో వస్తుంటే, మరోవైపు నారప్ప అంటూ వెంకటేష్ రీమేకింగ్ తో వస్తున్నాడు. నిజానికి రీమేకింగ్ సినిమాలు వెంకటేష్ కి బాగా కలిసోచ్చేస్తుంటాయి. అంతేకాదు, వెంకీ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్కరోజు తేడాలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మే 13వ తేదిన ఆచార్య వస్తుంటే, మే 14వ తేదిన వెంకటేష్ వస్తున్నాడు. అయితే, బాక్సాఫీస్ కొల్లగొట్టేందుకు థియేటర్స్ ఎక్కవ కావాలి కాబట్టి నారప్పని ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడి చాలా సంవత్సరాలు అయ్యింది. అంతేకాదు, ఇలా తలబడినప్పుడల్లా దాదాపుగా ఇద్దరి సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయి కూడా. ఇక ఈ ఇద్దరు హీరోల్లో బాక్సాఫీస్ ని ఎవరు షేక్ చేస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
అసురన్ రీమేక్ తో వస్తున్నాడు కాబట్టి వెంకటేష్ కథా పరంగా సక్సెస్ అయిన మూవీ లైన్ ని తీస్కున్నాడు. అంతేకాదు, ఈసారి ఈ హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకి చాలా అవసరం కూడా. ఇండస్ట్రీలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాలంటే ఈ సినిమా రిజల్ట్ అనేది కీలకం కాబోతోంది. అందుకే స్క్రిప్ట్ పరంగా పక్కాగా చూసుకుని, మంచి లొకేషన్స్ ని ఎంచుకుని పూర్తి రఫ్ లుక్ లో వెంకటేష్ ని వెండితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు, ఈసినిమాలో సెంటిమెంట్ పాళ్లు బాగానే ఉంటాయి కాబట్టి వెంకటేష్ ఎమోషన్స్ ని బాగా పలికిస్తాడు కాబట్టి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతుంది.
ఏమాత్రం స్క్రీన్ ప్లే పట్టుగా తీసినా సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ. అయితే, ఇంతవరకూ విక్టరీ వెంకటేష్ సినిమా 100కోట్లు కలక్ట్ చేసిన దాఖలాలు లేవు, సోలోగా మార్కెట్ ని షేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పక్కా కమర్షియల్ ఫార్ములాతో వస్తున్నాడు. ఆచార్య గా సరికొత్త అవతారాన్ని చూపించబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్ పక్కా ఉంటాయి కాబట్టి కాస్త బాగున్నా బంపర్ హిట్ అయిపోతుంది. సినిమా పరంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా అవుతోంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గ్యారెంటీ. సినిమా అట్టర్ ఫ్లాప్ అయితేనే తప్ప నష్టం అనేది రాదు. ఇక చిరంజీవి చేసే స్టెప్పులకి, పేల్చే డైలాగ్స్ కి, కొరటాల శివ ఇచ్చే ఎలివేషన్ కి ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకి ఎక్కేస్తుంది నో డౌట్. మరి ఈసారి మెగాస్టార్ ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి. ఇప్పుడు ఈ సీనియర్ హీరోల సినిమాలు సినీ లవర్స్ లో ఆసక్తిని రేపుతున్నాయి.