మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశబ్దాలకు పైనే అయింది. ఎన్నో ఏళ్ల పాటు ఆయన ఇండస్ట్రీని ఏలారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తుంది మెగాస్టార్ ఒక్కరే. ఇన్నేళ్ల అనుభవంతో ఆయన చాలా విషయాలు నేర్చుకున్నారు. కథలపై ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉంది. సెట్స్ లో కొన్నిసార్లు డైరెక్టర్ అవతారం కూడా ఎత్తారు. ఫ్యూచర్ లో చిరంజీవిని డైరెక్టర్ గా చూసే ఛాన్స్ ఉందా..?అంటే అవుననే చెబుతున్నారు చిరంజీవి.
ఈ నెల 13న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో డైరెక్షన్ గురించి టాపిక్ వచ్చింది. జీవితాంతం సినిమాలతో మమేకం అవ్వాలనుకుంటున్నానని.. ఫ్యూచర్ లో దర్శకత్వం చేస్తాననే నమ్మకం వచ్చి.. ఆ అవకాశం కుదిరితే తప్పకుండా సినిమా చేస్తానేమో అంటూ క్లారిటీ ఇచ్చారు. అలానే మెగాస్టార్ అతి మంచితనం గురించి ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చర్చించుకుంటూ ఉంటారు. ఎవరైనా తనను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తే చిరంజీవి పెద్దగా స్పందించరు.
దీని గురించి ఆయన్ను ప్రశ్నించగా.. అందరితో మంచిగా ఉండడం, సంయమనం పాటించడం కచ్చితంగా అవసరమని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురుతిరిగితే తన ఈగో చల్లారుతుందేమో కానీ.. తన సినిమాకి భారీగా నష్టం జరగొచ్చని అన్నారు. దాని వల్ల అభిమానులు నిరాశ చెందుతారని చెప్పారు. తన సంయమనం అందరికీ మంచి చేస్తుందంటే వెనక్కి తగ్గుతానని అన్నారు.
అంతిమ ఫలితం సానుకూలంగా రావడం ముఖ్యమని చెప్పారు. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా గురించి చిరు చాలా నమ్మకంగా మాట్లాడుతున్నారు. తన అభిమానులకు ఏం కావాలో.. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. పిల్లలు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అన్నారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!