మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలా అని కేవలం అభిమానుల కోసం మాస్ సినిమాలు మాత్రమే చెయ్యడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా పెద్దరికం కలిగి ఉంటున్నారు. కాబట్టి సామాజిక స్పృహ కలిగిన సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ లో మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ .. అందులో రైతుల గురించి మంచి మెసేజ్ కూడా ఉంటుంది.
ఇక ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో … మొదటి స్వాతంత్ర్య యోదుడి గొప్ప తనాన్ని చాటి చెప్పారు. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ చిత్రం చేస్తున్నారు మెగాస్టార్. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కథ ఎలా ఉంటుంది అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
దానికి ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.’ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్, ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుంది ఈ కథ. ఇందులో దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం కూడా ఉంటుందని’ తెలిపారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.