Bhola Shankar: భోళాశంక‌ర్ బిజినెస్ తగ్గటానికి అయనే కారణమా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించాయి. ఇక ఆగష్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటికీ 15 వేల డాలర్లు వచ్చాయని ట్రేడ్ రిపోర్టులు చెపుతున్నాయి.

ఇక బ్రో హ‌డావిడి ముగిసిన వెంట‌నే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కానున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విష‌యంలో ఏపీ, తెలంగాణ‌లో అంత హైప్ అయితే లేదు. ట్రేడ్ కూడా లైట్ తీస్కొంటోంది. అడ్వాన్స్‌లు కూడా పెద్ద‌గా రావ‌ట్లేద‌ట‌. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగా జరిగాయంటున్నారు. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ.70 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిందట.

చిరంజీవి గత సినిమా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్ల షేర్ వసూలు సాధించింది. అలాంటిది చిరంజీవి నటించిన ఈ సినిమాకు ఇంత తక్కువ బుకింగ్ జరగడం షాకింగ్‌గా ఉంది. తన కెరీర్‌లో ఒక్క సూపర్ హిట్ కూడా లేని మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. ఇది ఒక తమిళ్ సినిమాకు రీమేక్ కావడంతో బయ్యర్స్ రిస్క్ చేయలేకపోతున్నారని సమాచారం. డైరెక్టర్స్ ఎవరైనా.. రీమేక్ సినిమా అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా (Bhola Shankar) అంటే ఒక రేంజ్‌లో థియేట్రికల్ బిజినెస్‌లు జరుగుతూ ఉండేవి.

కాని ఒక్కసారిగా ఈ సినిమాకు అంత తక్కువ బిజినెస్ జరగడంతో మెగాస్టార్ రేంజ్ తగ్గిపోయిందా ? అన్న సందేహం చాలా మందిలో ఉంది. చిరంజీవి 70 ఏళ్ళ వయసుకి దగ్గరలో ఉన్నారు. అయినా వాల్తేరు వీర‌య్య‌తో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. దానికంటే కూడా మెహ‌ర్ ర‌మేష్ మీద ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు లేకే రేట్లు పెట్ట‌డం లేద‌న్న‌దే ఎక్కువుగా వినిపించే మాట‌.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus