టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం జరిగింది. ఏఎన్నార్ తర్వాత చిరంజీవి పద్మవిభూషణ్ అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సుస్మిత తన పోస్ట్ లో నాన్నా.. మీరు నాకు స్పూర్తి, గౌరవం, ఆశీర్వాదం అని సుస్మిత పేర్కొన్నారు.
పద్మ విభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని సుస్మిత చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకున్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు అని ఆమె చెప్పుకొచ్చారు. సుస్మిత చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో అరుదైన ఘనతలను అందుకుంటున్నారు. చిరంజీవి 45 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా పద్మవిభూషణ్ దక్కిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విశ్వంభర సినిమా కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్స్ట్ తో చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఉపాసన సైతం మామయ్య చిరంజీవికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగువారికి గర్వ కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి (Chiranjeevi) త్వరలో ప్రాజెక్ట్ ల విషయంలో మరింత వేగం పెంచనున్నారని ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లానింగ్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఒక్కో సినిమాకు చిరంజీవి 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కథల ఎంపికలో నవ్యతకు చిరంజీవి ప్రాధాన్యత ఇస్తున్నారు.