మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ పీక్స్ లో ఉన్న రోజులవి. జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వరుస బ్లాక్ బస్టర్స్. అప్పట్లో చిరంజీవి సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా చిరంజీవి ఏక ఛత్రాధిపత్యం చేస్తున్నాడు. అప్పుడు వచ్చిందే ఘరానా మొగుడు. 1992లో ఏప్రిల్ 9న విడుదలైన ఘరానా మొగుడు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ లో మొదటి 100 మిలియన్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
అనగా ఈ చిత్రం ఏకంగా 10కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం విడుదలై నేటికీ 28 ఏళ్ళు. జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు రాఘవేంద్ర రావు , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చి భారీ విజయాలు అదనుకున్నాయి. దీనితో వీరి కాంబినేషన్ పై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. ఈ అంచనాలను అధిగమిస్తూ ఘరానా మొగుడు చిత్రం భారీ విజయం అందుకుంది. చిరంజీవి అప్పటికే కోటి రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.
ఆ రేంజ్ లో చిరంజీవి ఫాలోయింగ్ ఉంది అప్పుడు. ఓ కన్నడ చిత్రం తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్ అందించారు. నగ్మా, వాణి విశ్వనాధ్ ల గ్లామర్ ఈ సినిమాకు మరో ఆకర్షణ. ఎం ఎం కీరవాణి స్వర కల్పనలో వచ్చిన సాంగ్స్ ఆంధ్రదేశాన్ని ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా బంగారు కోడి పెట్టా.., ఏందీ బే ఎట్టాగ ఉంది వళ్ళు వంటి సాంగ్స్ అందరి నోళ్ళలో నానాయి. ఘరానా మొగుడు చిరంజీవి స్టార్ డమ్ ని మరో స్థాయికి చేర్చింది.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!