ఖైదీ నంబర్ 150 లో చిరంజీవి రెండో పాత్ర లుక్ ఇదే !!
- January 9, 2017 / 08:16 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150 మరో రెండు రోజుల్లో థియేటర్లో సందడి చేయనుంది. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ కత్తి కి రీమేక్. అందులో హీరో విజయ్ రెండు క్యారక్టర్ లో ప్రేక్షకులకి థ్రిల్ ఇస్తూ, విలన్ ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఖైదీ నంబర్ 150 లోను చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన పోస్టర్, టీజర్, ట్రైలర్ లో జాలీగా ఉండి, ఫైట్లు చేసే చిరంజీవి కనిపించారు. శనివారం వచ్చిన ట్రైలర్ లో కూడా రెండో క్యారక్టర్ గురించి బయట పెట్టలేదు. కానీ షాట్ లో ఫోటో మాత్రం కనిపిస్తుంది.
వెల్కమ్ శంకర్ అంటూ పోస్టర్స్ ఉన్నాయి. ఈ శంకర్ పాత్ర కథలో కీలకమైనది. హైడ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి తన ఊరి దాహార్తిని తీర్చడానికి పోరాడే నాయకుడు ఈ కె.శంకర్. ఇతని లక్ష్యం నెరవేరడానికి అతని రూపంలో ఉండే మరో చిరంజీవి రంగంలోకి దిగుతాడు. అందుకే చిత్ర బృందం హైడ్రాలజిస్ట్ శంకర్ గెటప్ ప్రేక్షకులకు చూపించకుండా జాగ్రత్త పడుతోంది. వారిద్దరిని పూర్తి స్థాయిలో చూడాలంటే జనవరి 11 దాకా చూడాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















