Vikram, Prabhas: ప్రభాస్ ను మెచ్చుకుంటూ వార్తల్లో నిలిచిన విక్రమ్.. వాళ్లకు షాకిచ్చారుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas)  ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తన గురించి గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా వాటి గురించి రియాక్ట్ కావడానికి ప్రభాస్ ఎక్కువగా ఆసక్తి చూపించరు. సాధారణంగా ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోను మెచ్చుకోవడం అరుదుగా జరుగుతుంది. అయితే స్టార్ హీరో విక్రమ్ (Vikram)  మాత్రం ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని విక్రమ్ అన్నారు.

తంగలాన్ (Thangalaan)  సినిమాతో సక్సెస్ సాధించిన విక్రమ్ (Vikram) ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కామెంట్ చేశారు. ప్రభాస్ ను తెలుగు హీరో అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ గురించి విక్రమ్ గొప్పగా చెప్పడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో కొంతమంది బాలీవుడ్ నటులు ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

Vikram, Prabhas

అలాంటి వ్యక్తుల నోర్లు మూయించే విధంగా వాళ్లకు షాకిచ్చే విధంగా విక్రమ్ వ్యవహరించడం కొసమెరుపు. తంగలాన్ సినిమాలో విక్రమ్ తో కలిసి నటించిన మాళవిక మోహనన్  (Malavika Mohanan) రాజాసాబ్ సినిమాలో సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ (The Rajasaab)  ఆఫర్ గురించి ఆమె స్పందిస్తూ ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. రాజాసాబ్ పాన్ ఇండియా మూవీ అని భాష పరంగా ఉండే హద్దులను ప్రభాస్ చెరిపేశారని ఆమె పేర్కొన్నారు.

ప్రభాస్ నటించే సినిమాలపై ఆడియన్స్ చూపించే అభిమానాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని మాళవిక చెప్పుకొచ్చారు. ప్రభాస్ అందరి మంచి కోరే హీరో అని ప్రస్తుతం రికార్డ్స్ పరంగా ప్రభాస్ నంబర్ వన్ హీరో అని చెప్పడంలో సందేహం అక్కర్లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాప్ లో నిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల్ని సూర్య మెస్మరైజ్ చేసిన సినిమాలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus