SJ Suryah: నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల్ని సూర్య మెస్మరైజ్ చేసిన సినిమాలు.!

  • August 28, 2024 / 01:03 PM IST

ఈ మధ్య చాలామంది దర్శకులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. తెలుగులోనూ కొంతమంది అలా ప్రయత్నించినప్పటికీ.. తమిళ ఇండస్ట్రీలో ఈ ఒరవడి ఎక్కువగా ఉంది. అలనాటి స్టార్ డైరెక్టర్లు బాలచందర్, మహేంద్రన్ మొదలుకొని ఎస్.కె.రవికుమార్ (K. S. Ravikumar) వరకు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఈ తరం దర్శకుల్లో సముద్రఖని (Samuthirakani) , సుందర్.సి (Sundar C) , శశికుమార్ (Sasikumar)  దర్శకులుగా కంటే యాక్టర్లుగా ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ సెన్సేషన్ ఎస్.జె.సూర్య (SJ Suryah).

SJ Suryah

నిజానికి సూర్య (SJ Suryah) నటించడం ఎప్పుడో మొదలెట్టాడు. “నాని” తమిళ్ వెర్షన్లో ఆయనే హీరోగా నటించాడు. ఆ తర్వాత కూడా హీరోగా ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుటవ్వలేదు. అయితే.. ఎప్పుడైతే సూర్య విలన్ గా నటించడం మొదలెట్టాడో అతని సుడి తిరిగిపోయింది.

నిజానికి ఎస్.జె.సూర్యలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj). అతడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఇరైవి” (Iraivi) చిత్రంలో సూర్య నటన చూసినవాళ్లందరూ షాక్ అయ్యారు. అప్పటినుండి మొదలయ్యింది నటుడిగా సూర్య విశ్వరూప ప్రదర్శన.

స్పైడర్ తో షేక్ చేశాడు..

విలన్ గా ఎస్.జె.సూర్య మొదటి సినిమా “స్పైడర్” (Spyder) . మహేష్ బాబుతో (Mahesh Babu) “నాని” తీసి, అదే హీరోతో తలపడే శాడిస్ట్ విలన్ గా సూర్య నటన సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఆ సినిమాలోని మెట్రో పిల్లర్ దగ్గర అందరు ఏడుస్తుంటే.. సూర్య వాళ్ళ బాధలోనుంచి ఆనందం వెతుక్కునే శాడిస్ట్ గా అద్భుతంగా నటించిన తీరు ఇప్పటికీ చాలా మీమ్స్ లో కనిపిస్తుంటుంది.

రిపీట్ అంటూ ర్యాంప్ ఆడించాడు..

కరోనా తర్వాత విడుదలైన “మానాడు” (Maanaadu) చిత్రంలో ధనుష్ కోడి అనే పోలీస్ ఆఫీసర్ గా సూర్య నటన అన్నీ ఇండస్ట్రీల ప్రేక్షకుల సలామ్ పలికారు. ముఖ్యంగా “వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీటు” అనే డైలాగ్ ను సూర్య ఊపిరి తీసుకోకుండా పలికిన విధానానికి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఆ సినిమాలో హీరో శింబు (Silambarasan) అయినప్పటికీ.. సూర్యకే ఎక్కువ అప్లాజ్ వచ్చింది అని చెప్పాలి.

సిల్కా..

“మార్క్ ఆంటోనీ” (Mark Antony) చిత్రంలో కూడా విశాల్ ను (Vishal) డామినేట్ చేసేశాడు ఎస్.జె.సూర్య. ఆ సినిమాలో సూర్య “సిల్కా” అంటూ ఆశ్చర్యపోతూ చెప్పే డైలాగ్ ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇన్స్పెక్టర్ దయగా ఏం చేస్తాడో..

ఇక రేపు విడుదలకానున్న “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) సినిమాలోనూ ఎస్.జె.సూర్య విలన్ గా ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. టీజర్ & ట్రైలర్ లోనే అతడి నటన చూసి నాని తేలిపోతాడేమో అనే డౌట్లు వ్యక్తమయ్యాయి అంటేనే సూర్య ఏ స్థాయిలో జీవించేసాడో అర్థం చేసుకొని. నాని కూడా ప్రమోషన్స్ టైమ్ లో సినిమా రిలీజయ్యాక ముందు సూర్య గురించి మాట్లాడుకుంటారు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

సినీ పరిశ్రమలో విషాదం..’గులాబీ’ రైటర్ కన్నుమూత.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus