ఈరోజు రియాలిటీ షోలకి ఇంత డిమాండ్ ఉంది అంటే దానికి కారణం ఓంకార్ అనే చెప్పాలి. ప్రేక్షకులను కట్టిపారేసే విధంగా షోలను డిజైన్ చేయడంలో ఓంకార్ సిద్ధహస్తుడు. జెమినీ మ్యూజిక్ ఛానల్ లో ఓ విజె గా కెరీర్ ను మొదలుపెట్టిన అతను ‘ఆట’ ‘మాయాద్వీపం’ ‘ఛాలెంజ్’ ‘ఇస్మార్ట్ జోడి’ ‘సిక్స్త్ సెన్స్’ వంటి షోలతో బుల్లితెర పై స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ కోసం ‘డాన్స్ ఐకాన్’ అనే షో కి హోస్ట్ గా చేస్తున్నాడు ఓంకార్.
అంతేకాకుండా అతను డైరెక్టర్ గా కూడా ‘జీనియస్’ ‘రాజు గారి గది’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘రాజు గారి గది 2’ ని ఏకంగా నాగార్జునతో తెరకెక్కించి హిట్ అందుకున్నాడు ఓంకార్. అతను తలుచుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఓకే చేయించుకోగలను అని ఆ చిత్రంతో ప్రూవ్ చేశాడు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఓంకార్ తన ఆట షోలో మంచి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తుంది ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్.
ఆమె మాట్లాడుతూ.. “ఓంకార్ గారు… మీరు పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద మాస్టర్స్‌నే ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు మీ తమ్ముళ్లు ఎందుకు గుర్తుకురావడం లేదు సర్.? మీ తమ్ముళ్ళందరూ మీరు చెక్కిన శిల్పాలు కదా, మీరు చెక్కిన డైమండ్స్ కదా. మరి మీరు పెద్ద సినిమాలు చెసినప్పుడు మీ ఒక్కొక్క డైమండ్‌కి ఒక్కో అవకాశం ఇవ్వచ్చు కదా. మీరు కూడా పెద్ద మాస్టర్స్ ని పెట్టుకుని పబ్లిసిటీ కోసం ఎందుకు పరితపిస్తున్నారు. మీ తమ్ముళ్ళని మీరే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు.? నేను సందీప్‌ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు.
సందీప్ సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. ఒకప్పుడు ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్‌కైనా ఇప్పుడు లైఫ్ ఉందా? ఎంతోమంది బయట అవకాశాలు లేక, ఈవెంట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా ఒక పొజిషన్‌కి వెళ్ళి కిందికి పడిపోయారు. వీళ్ళలో ఎవరైనా బయట కనిపించినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఒకప్పుడు వీళ్లంతా మంచి డ్యాన్సర్లు కదా ఇలా అయిపోయారు ఏంటి? అని అనిపిస్తుంది” అంటూ జ్యోతిరాజ్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ కు ఓంకార్ ఎలా రియాక్ట్ అవుతాడో? అసలు రియాక్ట్ అవుతాడో.. లేదో చూడాలి..!
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!