ఫ్యామిలీ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీకాంత్ అడ్డాల.. ఈ మధ్య రూటు మార్చి మాస్ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘పెదకాపు -1’ అనే సినిమాని రూపొందించాడు. టీజర్, ట్రైలర్ చాలా ఇంప్రెస్ చేశాయి.విజువల్స్ కూడా టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. ఇక విజువల్స్ గురించి అలాగే ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :
ప్ర) ‘పెదకాపు-1‘ కి పనిచేయడం ఎలా అనిపించింది?
చోటా కె నాయుడు : శ్రీకాంత్ అడ్డాలతో నేను ‘కొత్త బంగారులోకం’ అనే సినిమా చేశాను. అప్పటి నుండి ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్ చాలా కూల్ గా ఉంటాడు. నాకొక కె విశ్వనాథ్ గారిలా అనిపిస్తాడు. ‘పెదకాపు-1‘ కథ నాకు చెప్పినప్పుడు.. దీన్ని అతను హ్యాండిల్ చేయగలడా లేదా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ‘నారప్ప’ చూసి అతనిలోని ట్రాన్స్ఫర్మేషన్ ను గమనించాను. ‘పెదకాపు -1’ ని అతను బాగా హ్యాండిల్ చేశాడు.
ప్ర) ట్రైలర్ లో విజువల్స్ చాలా కొత్తగా అనిపించాయి. మీరు బాగా కష్టపడినట్టున్నారు.
చోటా కె నాయుడు : కష్టం అనే మాట నేను వాడనండీ. పని చేయడం నాకు ఇష్టం. నేను చాలా ఇష్టపడి పని చేస్తాను. ఈ కథ కొత్త ప్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్ ని డిమాండ్ చేసింది. ఇది నాకు సవాల్ గా అనిపించింది.నేను ఇష్టంగానే పని చేశాను అంతే..!
ప్ర) మేకింగ్ దశలో డైరెక్టర్ కి మీరు సినిమాటోగ్రాఫర్ కాబట్టి.. ఏమైనా ఇన్ పుట్స్ ఇస్తూ ఉంటారా?
చోటా కె నాయుడు : తప్పకుండా ఇస్తాను. డైరెక్టర్ విజన్ నా ద్వారా కనిపించాలి కాబట్టి.. నా సజిషన్స్ ఇస్తాను.
ప్ర) ఈ సినిమాలో కొత్త హీరో విరాట్ తో చేయడం ఎలా అనిపించింది ?
చోటా కె నాయుడు : విరాట్ తో పని చేస్తున్నప్పుడు అతను కొత్త వాడు అనే ఫీలింగ్ కలగలేదు. అనుభవం ఉన్న హీరోలానే చేశాడు.
ప్ర) ‘పెదకాపు ‘ అనే టైటిల్ గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరేమంటారు?
చోటా కె నాయుడు : దీనికి శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా సమాధానం ఇచ్చాడు. నేను కూడా గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగాను..! మా ఇంట్లో కూడా ఆ పేరు ఎక్కువగా వినిపించేది. మా ఊర్లో చాలా మంది పెదకాపు కలిగిన వ్యక్తులు ఉన్నారు. మిగిలిన వాళ్లకి పెద్దగా తెలిసుండకపోవచ్చు.
ప్ర) ఈ సినిమాలో అనసూయ గారిని తీసుకోమని మీరే సజెస్ట్ చేశారట?
చోటా కె నాయుడు : ఆమెది ఓ డిఫెరెంట్ రోల్. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని టీం ఆలోచిస్తున్నప్పుడు…అనసూయ అయితే బాగుంటుంది అని నేను అన్నాను. ఆమెకి కూడా ఈ విషయం చెప్పాను.మేము అనుకున్నదానికంటే కూడా ఆమె చాలా బాగా చేసింది.
ప్ర)ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు కూడా నటించారు..మీకు ఎలా అనిపించింది?
చోటా కె నాయుడు : శ్రీకాంత్ కంటే ముందు వేరే నటుడుని అనుకున్నాం. ముందుగా ఆయన నటిస్తాడు.. అని ఎవ్వరూ అనుకోలేదు. ఆయనకి కూడా తెలీదు. అయితే ప్రతీది కూడా సింగిల్ షాట్లో ఓకే అయిపోయింది. శ్రీకాంత్ చేసిన ప్రతి సీన్ కి మా నిర్మాత రవీందర్ రెడ్డి గారు డైరెక్షన్ చేశారు.ఆ సన్నివేశాలు చాలా సరదాగా షూట్ చేశాం.
ప్ర) ‘అఖండ’ తర్వాత నిర్మాత రవీందర్ రెడ్డి గారు ఇలాంటి సినిమా చేయడం రిస్క్ అనుకోలేదా?
చోటా కె నాయుడు : ఈ సినిమా వేరే నిర్మాత అయితే కనుక రూ.5,రూ.6 కోట్లలో తీయమని అడిగేవారు. కానీ రవీందర్ రెడ్డి గారు కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టారు.అందరి కంటే ఎక్కువ ఈ కథని నమ్మింది ఆయన. ‘పెదకాపు’ అనే టైటిల్ తో సహా దర్శకుడు ఏమడిగితే అది ఇచ్చాడాయన. ‘పెదకాపు 2’ కూడా ఉంది అలాగే తన బావమరిది కూడా ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అది డబుల్ బాధ్యత.
ప్ర) ఈ సినిమా విషయంలో మీకు ఛాలెంజ్ అంటే.. ఏమనిపించింది?
చోటా కె నాయుడు : ఛాలెంజ్ అంటే చాలా ఉన్నాయి.కానీ ట్రైలర్లో కనుక మీరు చూస్తే ఒక అమ్మాయి ఎండిపోయిన చెట్టుకి హ్యాంగ్ చేసుకుని కనిపిస్తుంది. ఆ అమ్మాయి రేప్ కి గురైన తర్వాత అలా చేసుకుంటుంది. ఆ సీన్ చేయడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు టైం పట్టింది. ఆ సీన్ వెనుక చాలా కథ ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక చెబుతాను అది(నవ్వుతూ)
ప్ర)’పెదకాపు 1′ సంగీతం గురించి చెప్పండి ?
చోటా కె నాయుడు : శ్రీకాంత్ అడ్డాల, మిక్కీ జే మేయర్..లది మంచి కాంబినేషన్.మిక్కీ ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇస్తాడు అని నేను అనుకోలేదు. అలాగే హీరోయిన్ ప్రగతి కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది.
ప్ర)ఒకప్పుడు సినిమాల చిత్రీకరణ చాలా తక్కువ టైంలో అయిపోయేది.. ఇప్పుడు ఏళ్ళ తరబడి తీస్తూనే ఉన్నారు. సీనియర్ ఫిలిం మేకర్ గా.. దీని పై మీ అభిప్రాయం ఏంటి?
చోటా కె నాయుడు : 30 ఏళ్ళ క్రితం సంగతి చూసుకుంటే.. ‘బొబ్బిలి పులి’ సినిమాకి కూడా నేను పనిచేశాను.అందులో ఒక పాటని మేము 3 రోజుల్లో తీసేశాం. ఇప్పుడు 4 రోజులైనా ఒక్క పాట కూడా అవ్వడం లేదు. దీని వెనుక చాలా నీతి ఉంది. అది కనుక నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో దగ్గర చెప్పాను అంటే.. నన్ను పక్కన పెట్టేస్తారు(నవ్వుతూ) . కాబట్టి మన పని ఏదో మనం చేసుకుని వెళ్లిపోవడం బెటర్.
ప్ర)గోదావరి నేపథ్యంలో కథ,కుల ఘర్షణలు అనగానే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా?
చోటా కె నాయుడు : కథ పరంగా ఏమైనా పోలికలు కనిపించొచ్చేమో.కానీ ‘పెదకాపు-1’ లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి.
ప్ర)చిరంజీవితో మీ నెక్స్ట్ మూవీ అట కథ.. ఎలా ఉండబోతుంది.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?
చోటా కె నాయుడు : ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట్ మూవీ ఉంది. అది కూడా ఆ సినిమాలానే సోసియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఉంటుంది.నవంబర్ నుండి షూటింగ్ మొదలవుతుంది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!