సాహో షూటింగ్ గురించి చెప్పిన మది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీని తర్వాత చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడి శివార్లలో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. అది సరే సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది? థియేటర్లోకి ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వారి కోసం షూటింగ్ డీటైల్స్ ని కెమెరామెన్ మది వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికీ పూర్తవుతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ ఎన్ని నెలలు సాగుతోందో అతను వెల్లడించలేదు. ఎంత వేగంగా సాగినా మూడు నెలలు పడుతుంది. సో 2019 ఏప్రిల్ లో సాహో థియేటర్లోకి రావచ్చు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఇందులో విలన్ గా నీల్ నితిన్ ముకేష్, మరికొన్ని కీలక పాత్రలో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను ఆనంద్ లు నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సాహోకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus