Circle Review in Telugu: సర్కిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 7, 2023 / 11:50 AM IST

Cast & Crew

  • సాయి రోనక్ (Hero)
  • అర్షిణ్‌ మెహతా (Heroine)
  • రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు (Cast)
  • నీలకంఠ (Director)
  • ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ (Producer)
  • ఎన్.ఎస్ ప్రశు (Music)
  • రంగనాథ్ గోగినేని (Cinematography)

ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అన్నీ చిన్న సినిమాలే అయినా కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో ‘సర్కిల్’ ఒకటి. నేషనల్ అవార్డు డైరెక్టర్ గా పేరొందిన నీలకంఠ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి.గతంలో ‘షో’ ‘మిస్సమ్మ’ వంటి సక్సెస్ లు చూశారు. ఇంకా చాలా మంచి సినిమాలు తీశారు. 2014లో వచ్చిన ‘మాయ’ తర్వాత ఈయన చాలా గ్యాప్ తీసుకుని ‘సర్కిల్’ సినిమా చేశారు. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : కైలాష్(సాయి రోనక్) ఓ పేరుగాంచిన ఫోటో గ్రాఫర్. ఓ రోజు కైలాష్ తన ఫ్లాట్ కి వెళ్తున్నప్పుడు.. అతని పై హత్యా ప్రయత్నం చేస్తాడు ఓ హంతకుడు(బాబా భాస్కర్). తన జీవితంలో శత్రువులు ఎవరూ లేరు అనుకునే కైలాష్ ను హత్య చేయాలని ఆ హంతకుడు ఎందుకు ఎటాక్ చేశాడు? గతంలో ఇతను ప్రేమించిన అమ్మాయిల వల్ల ఇతను ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు.?

అసలు కైలాష్ ను చంపమని ఆ హంతకుడిని పంపింది ఎవరు? చివరికి కైలాష్ ఆ హంతకుడి నుండి తప్పించుకుని తన ప్రాణాలు ఎలా కాపాడుకున్నాడా? అన్నది మిగిలిన కథ..!

నటీనటుల పనితీరు : కైలాష్ అనే ఫోటో గ్రాఫర్ పాత్రలో సాయి రోనక్ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశాడు. గతంలో ఇతను చేసిన ‘పాఠశాల’ ‘ప్రెజర్ కుక్కర్’ ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి చిత్రాలతో పోలిస్తే బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకా పరిణితి చెందాల్సి ఉంది.గతంలో అల్లరి నరేష్ నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాలో హీరోయిన్ గా చేసిన రిచా పనై కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అరుంధతి అనే పాత్రలో కాసేపు అందాలు వడ్డించి మాయమైపోతుంది.

ఇక మరో హీరోయిన్ అర్షిన్ మెహతా.. ఇమాని అనే రాజకుమారి పాత్రలో కనిపించింది. ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి, గ్లామర్ పరంగా కూడా ఓకే కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయింది. ఇక హంతకుడిగా కనిపించిన బాబా భాస్కర్ ఇలాంటి సీరియస్ రోల్స్ కూడా చేయగలడు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది. తన విలక్షణ నటనతో ఎంగేజ్ చేస్తాడు. భవిష్యత్తులో అతనికి ఇలాంటి రోల్స్ మరిన్ని రావచ్చు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఓ ఫోటోగ్రాఫర్ తన జీవితంలో స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో తెలియని ఫేస్ కి ఎందుకు వెళ్ళాడు.? అతను గతంలో ఒకరికి చేసినవి మళ్ళీ అతనికి ఎదురైతే ఎలా రియాక్ట్ అయ్యాడు. విధి అతనికి రెండో ఛాన్స్ ఎలా ఇచ్చింది..? అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తో దర్శకుడు నీలకంఠ ఈ చిత్రాన్నితీర్చిదిద్దాడు. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా లెంగ్త్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మంచి కన్క్లూజన్ అయితే ఇచ్చాడు దర్శకుడు అని చెప్పొచ్చు.

కానీ గతంతో పోలిస్తే ఆయన మార్క్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ ను డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. టెక్నికల్ టీంని ఎంత బాగా వాడుకోవాలో నీలకంఠకి తెలుసు..!ఎన్.ఎస్ ప్రశు సంగీతంలో రూపొందిన పాటలు బాగానే ఉన్నా సిట్యుయేషన్ కి తగ్గట్టు లేకుండా ఉన్నాయి. బిజీయం జస్ట్ ఓకే. నీలకంఠ సినిమాల్లో సైలెన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ సినిమా విషయంలో కూడా అది రిపీట్ అయ్యింది. రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఓకే అనిపిస్తాయి.

విశ్లేషణ : నీలకంఠ మంచి లైన్ తో తీసిన ఈ సినిమా.. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ అయితే ఓకే అనిపిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా.. సెకండ్ హాఫ్ ను భరించగలం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus