Rashmika: ‘పుష్ప 2’లో శ్రీవల్లి పాత్రపై ఇదిగో క్లారిటీ!

సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోతే.. దాని మీద రకరకాల పుకార్లు వస్తాయి. అందులోనూ సినిమా షూటింగ్‌ ప్రారంభం గురించి అఫీషియల్‌ చెప్పి కూడా రాకపోతే.. ఇంకా ఎక్కువ పుకార్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న చిత్రం ‘పుష్ప 2’. గతేడాది డిసెంబరులో వచ్చిన ‘పుష్ప 1’కి రెండో పార్టుగా ఈ సినిమా రావాల్సి ఉంది. ఆలస్యమవ్వడంతో సినిమా చాలా పుకార్లు వస్తున్నాయి. అలాంటి వాటిలో శ్రీవల్లి పాత్ర ఒకటి. ఈ పాత్రను సినిమాలో కట్‌ చేసేస్తున్నారని అంటున్నారు.

‘పుష్ప 1’ ఆఖరున పుష్పరాజ్‌, శ్రీవల్లి పెళ్లి అయిపోతుంది. దీంతో రెండో పార్టులో సినిమాలో రొమాన్స్‌ మిస్‌ అవుతుంది అని టీమ్‌ అనుకుంటోంది అనే వార్తలొచ్చాయి. దీని కోసం శ్రీవల్లి పాత్రను ప్రారంభంలోనే ముగించేసి, రెండో హీరోయిన్‌ను తీసుకుంటారని వార్తలొచ్చాయి. దీని కోసం కొత్తగా రాసుకోవడానికే సినిమా లేట్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం సన్నిహిత బృందం నుండి ఓ విషయం బయటకు వచ్చింది. పుకార్లలో చెబుతున్నట్లు శ్రీవల్లి క్యారెక్టర్‌కు ఎలాంటి విషాదాంతం ఉండదు.

ఆ పాత్ర చివరి దాకా బతికే ఉంటుందట. అయినప్పటికీ సినిమాలో కావాల్సినంత రొమాన్స్‌, అందచందాలు పుష్కలంగా ఉండేలా సుకుమార్‌ టీమ్‌ ప్లాన్స్‌ చేస్తోందట. దాంతోపాటు కమర్షియల్‌ అంశాలు మిస్‌ కాకుండా, యాక్షన్‌ సీన్స్‌ తగ్గకుండా చూసుకుంటున్నారట. ‘కేజీయఫ్‌ 2’ను మించి ఎలివేషన్లు ఉండేలా చూసుకుంటున్నారట. ఈ సినిమా చిత్రీకరణ జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు కానీ..

అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. అందుకే అల్లు అర్జున్ ఫ్యామిలీని తీసుకుని వెకేషన్‌కు వెళ్లిపోయాడు అంటున్నారు. ఈ లెక్కన సినిమా 2023 వేసవి తర్వాతే వస్తుంది అని అంటున్నారు. మ్యాగ్జిమమ్ వచ్చే ఏడాది దసరాకు రావొచ్చు అని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్స్‌ రెడీ చేశారట. అయితే బ్యాగ్రౌండ్‌ స్కోరును ఈ సారి తమన్‌తో చేయిస్తారనే మాటలూ వినిపిస్తున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus