Sekhar Kammula, Dhanush: ధనుష్ మార్పులకు శేఖర్ ఒప్పుకుంటారా?

ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో శేఖర్ కమ్ముల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల తర్వాత సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ధనుష్ కు ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ధనుష్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఎక్కువగా మాస్ సినిమాలలో నటించే ధనుష్, క్లాస్ సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా ప్రకటన వెలువడటంతో అటు శేఖర్ ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ధనుష్ తన పాత్రను తమిళ ఆడియన్స్ కు నచ్చే విధంగా మార్చాలని కోరినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శేఖర్ కమ్ముల ధనుష్ చెప్పినట్టు కథలో మార్పులు చేయలేక ఇబ్బంది పడుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ధనుష్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. వరుస విజయాలతో జోరుమీదున్న శేఖర్ కమ్ముల ధనుష్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. హీరోలను సింపుల్ గా చూపించే శేఖర్ కమ్ముల ధనుష్ ను కూడా అదే విధంగా చూపిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus