మహేష్, మురుగదాస్ మూవీలో హైలెట్ గా క్లైమాక్స్ ఫైట్
- March 11, 2017 / 08:02 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా చేస్తున్న ద్విభాషా చిత్రం పై భారీ అంచనాలున్నాయి. తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వందకోట్ల బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇది క్లైమాక్స్ ఫైట్. ఇందులో రోలర్ కోస్టర్ పై మహేష్, ఎస్.జె సూర్యల మధ్య జరిగే ఫైట్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందని తెలిసింది. మహేష్ బాబు సినిమాల అన్నింటిలోకీ బెస్ట్ క్లైమాక్స్ అనిపించుకునే స్థాయిలో దీనిని మురుగదాస్ రూపొందిస్తున్నారు.
ఈ షెడ్యూల్ కంప్లీట్ అయితే టాకీ పార్టీ పూర్తి అయినట్లే. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పక్కన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమా జూన్ 23 థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















