2022 సంవత్సరం మార్చి నెల తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ నెలలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, తారక్ హీరోలుగా నటించారు. అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం
రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడంతో పాటు హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అయినప్పటికీ ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకోకపోవడంతో టికెట్ రేట్లను పెంచుకోవడానికి వీలు లేదు. అయితే జగన్ సర్కార్ ఈ రెండు సినిమాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు విధించింది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కావడంతో ఈ సినిమాలకు పదిరోజుల పాటు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది.
అదే సమయంలో ఈ సినిమాలకు ఐదో షోకు కూడా అనుమతులు ఇస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాధేశ్యామ్ రిలీజ్ ముంగిట వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరనుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా పెంచకపోయినా గతంతో పోలిస్తే టికెట్ రేట్లు మెరుగ్గా ఉండటంతో పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరనుంది. చిన్న సినిమాలకు కూడా ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
తెలంగాణ టికెట్ రేట్లతో పోల్చి చూస్తే మాత్రం ఏపీలో టికెట్ రేట్లు మరీ ఎక్కువగా అయితే లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో గ్రామ, నగర పంచాయితీలలో టికెట్ రేట్లను మరింత పెంచితే బాగుంటుందని థియేటర్ల యజమానులు భావిస్తున్నారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!