NTR: ఆ నినాదాలపై యంగ్ టైగర్ స్పందించరా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినీ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా ఇతర భాషల ప్రేక్షకుల్లో ఆయనకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ఇతర భాషల ప్రేక్షకులు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే రాజకీయాలకు మాత్రం తారక్ ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తారక్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్లిన సమయంలో కొంతమంది తారక్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

అభిమానులు చేసిన ఈ నినాదాలపై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నినాదాల గురించి స్పందించడం లేదు. ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలని టీడీపీ కార్యకర్తలు సైతం కోరుకుంటున్నారు. ఏపీలో గడిచిన మూడేళ్లలో టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినా ఆ పార్టీకి కొంతమేర ప్రయోజనం చేకూరుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సంచలనాలు సృష్టించడం ఖాయం అనే భావన చాలామందిలో ఉంది.

సినిమా ఇంటర్వ్యూలలో మాత్రం ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని ఈ స్టార్ హీరో చెబుతున్నారు. అయితే రాజకీయాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందనే ప్రశ్నకు సమాధానం మాత్రం అంతుచిక్కడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో వరుస సక్సెస్ లతో జోరుమీదున్నారు. టెంపర్ సినిమా నుంచి సినిమాసినిమాకు ఆయన రేంజ్ పెరుగుతోంది.

అయితే రాజకీయాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అవుతారనే భావన చాలామందిలో ఉంది. రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఆగష్టు నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus