ఓవర్సీస్ లో కంచరపాలెం హవా!
- September 10, 2018 / 07:47 AM ISTByFilmy Focus
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ కలక్షన్స్ మంచి ఆదాయవనరుగా మారింది. స్టార్స్ నటించిన సినిమాలు అక్కడ రెండు మిలియన్ డాలర్లను అవలీలగా రాబడుతున్నాయి. కాస్త బాగుందని టాక్ వస్తే చాలు థియేటర్లు నిండిపోతున్నాయి. స్టార్స్ నటించని సినిమాలు సైతం భారీ కలక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. దర్శకనిర్మాతలను ఆనందపరుస్తున్నాయి. గత వారం రిలీజ్ అయిన “కేరాఫ్ కంచరపాలెం” మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మహా వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలి వారంతంలో $185K కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సాధారణంగా ఈ కలక్షన్స్ తక్కువ అయినప్పటికీ సినిమా బడ్జెట్.. స్టార్ అట్రాక్షన్స్ లేకపోవడం వంటి కారణాలు లెక్కలోకి తీసుకుంటే ఇది పెద్ద కలెక్షనే. శుక్రవారం $55396 , శనివారం $85505 , ఆదివారం నాడు $35K కలెక్షన్స్ తో ఈ సినిమా అమెరికాలో సత్తా చాటింది. రాజమౌళి, సుకుమార్, క్రిష్, శేఖర్ కమ్ముల, కీరవాణి, మహేష్ బాబు వంటి వారు ప్రశంసిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది.














