Cobra Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘కోబ్రా’..!

  • September 6, 2022 / 08:07 PM IST

చియాన్ విక్రమ్ హీరోగా ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సి.బి.ఐ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ బ్యానర్‌ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ‘ఎన్వీఆర్ సినిమా’ ద్వారా విడుదల చేస్తున్నారు. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం..

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ‘కోబ్రా’ పై అంచనాలు పెరిగాయి.కానీ మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది.కానీ రెండో రోజు నుండి తగ్గిపోయాయి.6 వ రోజున కూడా ఈ మూవీ కలెక్షన్లు మరింత తగ్గాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 1.15 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.64 cr
ఈస్ట్ 0.36 cr
వెస్ట్ 0.32 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.33 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.71 cr

‘కోబ్రా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.3.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.0.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి రోజున బాగా కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయిపోయింది.వీకెండ్ వరకు కూడా కొంత వరకు పర్వాలేదు అనిపించగా నిన్న మొదటి సోమవారం రోజున కలెక్షన్లు బాగా తగ్గాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus