Suhas: నేను నార్మల్ గా నవ్వినా నా భార్య భయపడేది… హీరో సుహాస్ కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలన్, హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కలర్ ఫోటో హీరో సుహాస్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతో బిజీగా మారిపోయారు. హీరోగా మంచి అవకాశాలను అందుకున్నప్పటికీ ఈయన మాత్రం విలన్ పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇక కలర్ ఫోటో ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుహాస్ త్వరలోనే రైటర్ పద్మభూషణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అయితే తన పెళ్లి విషయం కనీసం స్నేహితులకు కూడా తెలియదని తెలిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన సినీ కెరియర్ లో మంచి అవకాశాలు వచ్చాయని ఈయన తెలిపారు.

తాజాగా ఆయన నటించినా ఫ్యామిలీ డ్రామా సీరీస్ గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ఈ సినిమాలో తాను సైకోగా నటించడంతో నా భార్య చాలా భయపడిందని ఆ పాత్రలో నన్ను చూసి మూడు రోజుల పాటు ఇంటికి కూడా రానివ్వకుండా ఆఫీసులోనే పడుకోమని చెప్పిందని సుహాస్ వెల్లడించారు. ఈ సిరీస్ విడుదలైన తర్వాత నేను ఇంట్లో నార్మల్ గా నవ్వినా కూడా తాను భయపడేది

అంటూ తన భార్య గురించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణం సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus