Swathi: వాళ్లు ఇచ్చిన ధైర్యం వల్లే మళ్ళీ సినిమాలు చేస్తున్నాను : కలర్ స్వాతి

కలర్స్ స్వాతి.. చిన్న వయసులోనే బుల్లితెరపై ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి కలర్స్ స్వాతిగా అందరికీ సుపరిచితం. ఈ కార్యక్రమంతో ఫేమస్ అయిన కలర్స్ స్వాతి.. యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించి హీరోయిన్ కావడానికి పెద్దగా టైం తీసుకోలేదు. ఈమె కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘డేంజర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించి మంచి పాపులారిటీ ని సంపాదించింది. ఆ తర్వాత తమిళం లో ‘సుబ్రమణ్య పురం’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకున్న కలర్స్ స్వాతి. తెలుగులో ‘అష్టా చమ్మ’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లింది. పెళ్లి తర్వాత సినిమాలు ఒద్దు అనుకోని కొంతకాలం బ్రేక్ ఇచ్చిన కలర్స్ స్వాతి , ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో ఆమె అర్థవంతమైన సినిమాలు చేస్తూ ఒక బ్రాండ్ ని మ్యానేజ్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకి ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా! ఇక సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యం వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ ఆమె (Swathi) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus