ఒకప్పుడు ప్రతి శుక్రవారం విడుదలైన సినిమాల్లో అలీకి క్యారెక్టర్ ఉండేది. ఆయన కామెడీ లేకుండా వినోదాత్మక సినిమా ఉండదు అని అనుకునేవారు. అయితే ఏమైదందో ఏమో గత కొన్ని రోజులుగా చూస్తుంటే అలీ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి, వెళ్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అనే డౌట్ చాలామందిలో ఉండే ఉంటుంది. ఈ విషయం అలీ దగ్గర ప్రస్తావిస్తే ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ సమస్య చాలామంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థమవుతుంది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే… ‘‘ఈమధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు. పాత్ర చాలా బాగుంటుంది అంటూ.. కథేమిటో చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తున్నప్పుడు ‘అలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు?’ అనుకునేలా ఆ సినిమాలు ఉంటున్నాయి. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు వస్తున్నా చేయడం లేదు. కథ నచ్చితేనే చేస్తాను’’ అని చెప్పారు. ఇక టీవీ సీరియల్ కోసం నటించడం గురించి కూడా అలీ మాట్లాడారు.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసమే ‘యమలీల’ సీరియల్ చేస్తున్నానని చెప్పారు అలీ. స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశారు. ఆయన చెప్పారంటే వెనకా ముందూ ఆలోచించకుండా చేస్తాను. అందుకే ఇప్పుడు ‘యమలీల’ సీరియల్ చేశాను అని వివరించారు అలీ. దీంతోపాటు ఇతర భాషల అవకాశాల గురించి కూడా అలీ చెప్పుకొచ్చారు. తనకు ఇప్పుడు తెలుగుతోపాటు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి అని చెప్పారు.
మొన్నీమధ్య ఓ నేపాలీ సినిమాకి సంతకం చేశారట. ఒకప్పుడు ఉత్తరాది వాళ్లను తీసుకొచ్చి నటన, భాష నేర్పించి మరీ డబ్బు ఇచ్చేవారు మన దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకి మన సత్తా ఏమిటో బాగా తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మేం ఇండియన్ స్టార్స్‌గా మారాం అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే ఆ నేపాలీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. త్వరలో చెబుతారేమో చూడాలి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!