Dhanraj: నాన్న ఎలా ఉంటారు తెలియదు అంటూ ఎమోషనల్ అయిన ధనరాజ్!

తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ వెండితెరపై కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా అదే స్థాయిలో గుర్తింపు పొందారు.ఇలా బుల్లితెరపై వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలోను పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో ధనరాజ్ పాల్గొని పెద్ద ఎత్తున తన పంచ్ డైలాగులతో అందరిని నవ్విస్తూ ఉంటారు. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ఫ్యామిలీ నెంబర్ 1కార్యక్రమంలో ధనరాజ్ పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా ధనరాజ్ ఏకంగా స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.

ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే ధనరాజ్ ఇలా స్టేజ్ పై ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఈయన వేదికపై తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు నుంచి నాకు నా తండ్రి ఎలా ఉంటారనే విషయం తెలియదు. నాన్న ఆలనా పాలన ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా నాన్న ఇలా ఉండేవారా అలా ఉండేవారా అని ఊహించుకుంటూ ఉండేవాడినని తెలిపారు.

ఇక నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా రక్తసంబంధీకులు అంటూ ఎవరు కూడా లేరని ఈ సందర్భంగా తన తండ్రి గురించి తలుచుకొని ధనరాజ్ ఎమోషనల్ అయ్యారు.నాకంటూ నా రక్తసంబంధీకులు ఉన్నారు అంటే అది నా పిల్లలు పుట్టిన తర్వాతనేనని వాళ్లే నా రక్తసంబంధీకులు అంటూ తన కుటుంబాన్ని చూపిస్తూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ధనరాజ్ పెద్ద కుమారుడు కూడా వేదిక పైకి వచ్చి డాడీ, మమ్మీ, తమ్ముడు, ఈ ముగ్గురేనా ప్రపంచం అంటూ తాను కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus