ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పృథ్వీకి ఆఫర్లు తగ్గగా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం పృథ్వీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇతర కమెడియన్లతో పోల్చి చూస్తే తక్కువ రెమ్యునరేషన్ కు సినిమాల్లో నటించడానికి అంగీకరిస్తూ ఉండటంతో పృథ్వీకి సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. జనసేనకు సపోర్ట్ గా పృథ్వీ ప్రస్తుతం కామెంట్లు చేస్తుండగా పవన్ కళ్యాణ్ పృథ్వీని పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
అయితే తాజాగా థియేటర్లలో సత్యదేవ్ నటించిన గాడ్సే మూవీ విడుదలైంది. గోపీ గణేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డైలాగ్స్ బాగానే ఉన్నా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. సత్యదేవ్ నటన విషయంలో మెప్పిస్తున్నా మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. గాడ్సే సినిమాలో పృథ్వీ పరిశ్రమల శాఖా మంత్రి పాత్రలో కనిపించారు.
సినిమాలో పృథ్వీ “నేను వెనుక నుంచి వాటేసుకుందామని అనుకుంటే నా కొంప ముంచారు” అని చెప్పిన డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. పృథ్వీ తనపై తాను పంచ్ లు, సెటైర్లు వేసుకోవడం గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ ఇచ్చిన పదవిలో ఉన్న సమయంలో వివాదం వల్ల పృథ్వీ పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ వివాదానికి కారణమైన డైలాగ్స్ ను సినిమాలో పృథ్వీ స్వయంగా చెప్పడం గమనార్హం.
సినిమాలో తనపై తనే పృథ్వీ సెటైర్లు వేసుకునే డైలాగ్స్ మరిన్ని ఉన్నాయి. పృథ్వీ మంచి పాత్రలను ఎంచుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తే పృథ్వీ కెరీర్ పరంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!