సునీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాల్లో నటించిన సునీల్.. అటు తర్వాత కమెడియన్ గా మారి ‘నువ్వేకావాలి’ ‘చిరునవ్వుతో’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంలో సునీల్ కామెడీ కూడా కీలక పాత్ర పోషించింది. దాంతో ఇతను స్టార్ కమెడియన్ అయిపోయాడు. బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ వంటి సీనియర్ స్టార్ కమెడియన్స్ ను కూడా సైడేసేసాడు అనడంలో సందేహం లేదు. ఏడాదికి 20 సినిమాల్లో నటించేవాడు సునీల్. 365 రోజులు బిజీగా ఉండేవాడు.
అటు తర్వాత హీరోగా కూడా మారి ‘మర్యాదరామన్న’ ‘పూల రంగడు’ వంటి పలు హిట్లు అందుకున్నాడు. అప్పట్లో సునీల్ కు రూ.20 కోట్ల మార్కెట్ ఉండేది. అయితే కొత్త హీరోల ఎంట్రీ వల్ల.. అలాగే కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గిపోవడంతో తర్వాత సునీల్ కు హీరోగా వర్కౌట్ కాలేదు. దాంతో మళ్ళీ ఇప్పుడు కమెడియన్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. సునీల్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు పెద్దగా ఎవ్వరికీ తెలియకపోయి ఉండచ్చు.
సునీల్ సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరం. ఇతని తండ్రి 5 ఏళ్ళకే చనిపోవడంతో.. అతని తల్లి సంరక్షణలో పెరిగాడు. ఇక సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. ఈమె సునీల్ బంధువుల అమ్మాయేనట..! ఇక సునీల్ కు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు. ఇప్పటివరకు మనం చూడని సునీల్ ఫ్యామిలీ ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :
1
2
3
4
5
6
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!