నందమూరి హీరోల సినిమాల్లో కామన్ పాయింట్ ఇదే!

గడిచిన తొమ్మిది నెలలలో నందమూరి హీరోలు నటించిన అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార థియేటర్లలో విడుదలయ్యాయి. అఖండ సినిమా రిలీజ్ రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం బింబిసార కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. బింబిసార సినిమా బిజినెస్ లో 30 శాతం తొలిరోజు కలెక్షన్ల రూపంలోనే వచ్చిందని తెలుస్తోంది.

అయితే ఈ మూడు సినిమాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు ఒక పాప చుట్టూ తిరిగే కథాంశాలు కావడం గమనార్హం. అఖండ సినిమాలో చిన్నారికి విలన్లు ఇబ్బందులు కలగజేయడానికి ప్రయత్నిస్తే అఘోరా పాత్రలో బాలయ్య ఎంట్రీ ఇచ్చి చిన్నారిని రక్షిస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్లి అనే పాప పాత్ర చుట్టూ తిరిగే కథాంశం కావడం గమనార్హం.

బింబిసార సినిమాలో కూడా పాప పాత్రను ప్రధానంగా తీసుకుని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బింబిసార మూవీ హవా కొనసాగుతోంది. ఈ వీకెండ్ లో సినిమా చూడాలని అనుకునే వాళ్లకు బింబిసార సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించగా రెండు పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. బింబిసారుడి పాత్రలో, దేవదత్తుడి పాత్రలో అద్భుతంగా నటించి కళ్యాణ్ రామ్ మెప్పించారు.

నిర్మాతగా కూడా బింబిసార కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు కళ్యాణ్ రామ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. బింబిసార మూవీ సక్సెస్ తో కళ్యాణ్ రామ్ బింబిసార2 దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus