Mokshagnya: రామ్‌ చరణ్‌.. మోక్షజ్ఞ పేర్లలో కామన్‌ పాయింట్‌.. ఏంటో తెలుసా?

నందమూరి కొత్త వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma)  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని టీమ్‌ ఇటీవల అనౌన్స్‌ చేసింది. నిజానికి ఈ సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒకరు పైన చెప్పుకున్న మోక్షజ్ఞ అయితే.. రెండోది ఆయన సోదరి మతుకుమిల్లి తేజస్విని. నందమూరి బాలకృష్ణ (Balakrishna)  రెండో కుమార్తె ఆమె. నిర్మాతగా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే మోక్షజ్ఞ పేరు విషయంలో రెండు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

Mokshagnya

మోక్షజ్ఞ (Mokshagnya) ఫస్ట్‌ లుక్‌ వచ్చిన ఆనందంలో అభిమానులు, సమాచారం తెలుసుకున్న ఆలోచనలో ఉన్న ప్రేక్షకులు ఓ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పాలి. అదే మోక్షు పూర్తి పేరు. సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన పోస్టులో ‘నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ’ అని రాసిన విషయం మీరు గమనించే ఉంటారు. మోక్షుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అలా రాసుకొచ్చారు.

దీంతో మోక్షజ్ఞ (Mokshagnya) పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. తాతయ్య, నాన్న పేర్లను నిలబెట్టేలా మోక్షు మంచి హీరోగా ఎదుగుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు రామ్‌చరణ్‌ పూర్తి పేరు రామ్‌ చరణ్‌ తేజ. సినిమాల్లో రామ్‌చరణ్‌  (Ram Charan)  అనే పేరును పెడుతున్నారు.

ఈ లెక్కన మోక్షు పేరులో ఇటు తాత పేరు, అటు బాలయ్య ఫ్రెండ్‌ చిరంజీవి (Chiranjeevi)   తనయుడు పేరు కూడా ఉంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అన్నట్లు మోక్షజ్ఞ పేరు ఇంగ్లిష్‌లో మొన్నటివరకు mokshagna అనే రాసేవారు. అయితే న్యూమరాలజీ ప్రకారమో, లేక మొదటి నుండి అలానే ఉందేమో కానీ.. ఇంగ్లిష్‌లో mokshagnya అని రాస్తున్నారు. అదన్నమాట మేటర్‌. ఇక అసలు మేటర్‌ ఇంకొకటి ఏంటంటే.. ఇంకా మోక్షజ్ఞ (Mokshagnya) శిక్షణ జరుగుతోందట. అందుకే సినిమా షూటింగ్‌ ప్రారంభానికి చాలా టైమ్‌ ఉందట.

 ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌.. చాలా హ్యాపీగా ఉంది అంటున్న రేణు దేశాయ్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus