Renu Desai: ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌.. చాలా హ్యాపీగా ఉంది అంటున్న రేణు దేశాయ్‌!

కచ్చితంగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదనే అనే ధైర్యమో.. లేక స్వతహాగా ఆమె స్ట్రాంగ్‌ మైండ్‌ సెట్‌ వల్లనో కానీ.. ఏదైనా విషయం గురించి, అందులోనూ సినిమా వాళ్లకు సంబంధించిన విషయం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తుంటుంది. అలా తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెడుతూ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా గురించి కామెంట్స్‌ చేసింది. ఇలాంటి సినిమా పరాజయం పాలవ్వడం మంచిదైంది అనేలా మాట్లాడింది. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.

Renu Desai

ఇటీవల విడుదలైన ఈ సినిమా దారుణమైన పరాజయం పాలైంది. సినిమాలో ఏ ఒక్క అంశంలో అయినా అభిమానులు ఆనందపడ్డారు అనే పరిస్థితే లేదు. అయితే సినిమాలో కొన్ని డైలాగ్స్‌ విషయంలో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేణు దేశాయ్‌ కూడా అదే మాట అంటున్నారు. రేణు దేశాయ్‌ (Renu Desai) తొలి నాళ్ల నుండి జంతువుల విషయంలో కేరింగ్‌గానే ఉంటూ వచ్చారు. వీధి శునకాల విషయంలోనూ రేణు దేశాయ్ సాయం చేస్తున్నారు.

జంతువులను ఎవరైనా హింసించినా, వాటి పట్ల చెడుగా ప్రవర్తించినా రేణు దేశాయ్ (Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కారణంతోనే ‘భారతీయుడు 2’ సినిమా రైటింగ్‌ టీమ్‌ మీద మండిపడ్డారు. ‘భారతీయుడు 2’ సినిమాలో కమల్ హాసన్ ఓ సన్నివేశంలో విలన్‌తో డర్టీ స్ట్రీట్ డాగ్ అని అంటాడు. మరో సన్నివేశంలో ఆ కుక్కని తరిమి కొట్టండి అని కూడా అంటాడు. ఈ డైలాగ్స్‌ విషయంలోనే రేణు దేశాయ్ అభ్యంతరం తెలిపారు. స్ట్రీట్ డాగ్స్ డర్టీ కాదు. వాటి పట్ల ప్రేమ చూపించాలి.

ఇలాంటి సినిమా ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉంది. రచయితలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారో అంటూ రేణు దేశాయ్ (Renu Desai) ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. జంతువుల విషయంలో ఇలాంటి డైలాగ్స్‌ రాయడం, రావడం కొత్తేమీ కాదు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా రేణు దేశాయ్‌కు ఆగ్రహం ఎందుకు వచ్చిందో అని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు అందులో హింసించడం ఏమీ లేదు కదా అని అంటున్నారు. ఇంకొందరైతే ఆమె ఆగ్రహం సరైందే అని స్పందిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus