మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య, బాలకృష్ణ నటించిన అఖండ సినిమాల షూటింగ్ లు కొన్ని నెలల గ్యాప్ లోనే మొదలయ్యాయి. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా అఖండ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలను చూసిన ప్రేక్షకులు ఈ రెండు సినిమాల విషయంలో పోలికలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఆచార్య సినిమానే మొదట విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల మేకర్స్ ఈ సినిమాను ఆలస్యంగా విడుదల చేశారు.
అఖండలో మైనింగ్ కీలకమైన అంశం కాగా ఆచార్య సినిమాను కూడా మైనింగ్ ప్రధానంగా దర్శకుడు తెరకెక్కించడం గమనార్హం. ఆచార్యలో చిరంజీవికి జోడీ లేదనే సంగతి తెలిసిందే. అఖండలో కూడా అఘోర పాత్రకు హీరోయిన్ లేకపోవడం గమనార్హం. ఆచార్య, అఖండ సినిమాలలో క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ రెండు సినిమాలలో హీరోలు ధర్మాన్ని రక్షించడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
అఖండ నెగిటివ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆచార్య సినిమా కూడా నెగిటివ్ టాక్ తోనే మొదలైంది. ఆచార్య, అఖండ సినిమాలు మూడు అక్షరాలతోనే తెరకెక్కడం గమనార్హం. మరోవైపు ఆచార్య తొలిరోజు రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సొంతం చేసుకుంది. నైజాం, సీడెడ్ ఏరియాలలో ఈ సినిమా తొలిరోజే భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీకెండ్ వరకు ఆచార్య సినిమా ఇదే దూకుడును కొనసాగిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
విద్యార్థులకు పరీక్షల వల్ల ఆచార్య సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య ఫుల్ రన్ లో ఏ మేరకు కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.