సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులకు సినిమాలో కంటెంట్‌ను ట్రిమ్ చేసిన సందర్భాలు చూసుంటారు. అలాగే సినిమాలో కంటెంట్ యాడ్ చేసిన పరిస్థితులూ చూసుంటారు. రెండో రకం చాలా తక్కువ ఉంటాయి. ఓటీటీలు వచ్చాక… అందులో సినిమా వచ్చేటప్పుడు యాడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత పాట యాడ్ చేస్తుంటారు. దీనికి ఉదాహరణగా ‘చెన్నకేశవరెడ్డి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ లాంటివి చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దారిలో ‘భగవంత్ కేసరి’ కూడా వచ్చి చేరుతోంది.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి’. విజయదశమి కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుందని, అయితే దానిని సినిమా విడుదల సమయంలో కాకుండా… దసరా రోజు యాడ్ చేస్తామని తెలిపారు. అంటే రిలీజ్ అయిన సుమారు వారం తర్వాత ఈ సాంగ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందన్నమాట.
ఈ విషయం తెలిసినప్పటి నుండి ఈ సినిమాకు, (Chenna Kesava Reddy) ‘చెన్నకేశవరెడ్డి’కి అభిమానులు పోలికలు మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో కూడా ఇలానే రిలీజ్ టైమ్‌లో ఓ పాట పెట్టకుండా.. రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత పెట్టారు. శ్రియ – బాలకృష్ణ మధ్య తీసిన ‘నలుపు నలుపు తెలుపు తెలుపు’ పాటను యాడ్ చేశారు. అయితే అప్పటికే ఆ సినిమా (ఫలితం) తేలిపోవడంతో జనాలు మళ్లీ ఆ పాటను చూడటానికి థియేటర్లకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలానే ఆలస్యంగా పాటను యాడ్ చేస్తున్నారు.
దీంతోపాటు మరో పాయింట్ కూడా కామన్‌గా ఉంది. అదే జైలు సన్నివేశాలు. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా జైలు నేపథ్య సన్నివేశాలతోనే ప్రారంభమవుతుంది. కాసేపటి కథ వేరే దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’లో కూడా అలానే జైలు సన్నివేశాలు తొలి పదిహేను నిమిషాలు ఉన్నాయి అంటున్నారు.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!