Anurag Kashyap: స్టార్ డైరెక్టర్ పై శోభితా ధూళిపాళ కామెంట్స్!

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ పై ఫిర్యాదు నమోదైంది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్ గతేడాది జనవరిలో విడుదలై నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్ లో నటి శోభితా ధూళిపాళ పాత్రకు గర్భస్రావం అవుతుంది. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ చనిపోయిన బిడ్డను చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. నిజానికి ఈ సీన్ కథకు అవసరం లేదని..

అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అంశమని జూలై 27న నమోదైన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదవుతుందా లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ఎందుకంటే కంటెంట్ విడుదలైన తరువాత 24 గంటల్లో ఫిర్యాదు చేయాలనేది రూల్. అయినప్పటికీ ఈ ఫిర్యాదుపై సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకు సైతం తెలియజేసినట్లు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

అయితే ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసారం శాఖ ఐటీ యాక్ట్ ను కఠినతరం చేసింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్‌-2021’ను రిలీజ్‌ చేసింది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus