మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ (మా) ఎన్నికలు ఈ దఫా చాలా వాడివేడిగా సాగుతాయని చాలా రోజుల నుండి టాలీవుడ్ పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తమ ప్యానల్స్‌ను అనౌన్స్ చేశారు. అయితే ఈ రెండు ప్యానల్స్ అనౌన్స్ చేయగానే జరిగిన కామన్ పాయింట్ ఒకటి ఉంది. అదే ఫిర్యాదుల రాజకీయం. అవును. కావాలంటే చూడండి మీకే అర్థవుతుంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ప్రకటించగానే జీవిత ‘ఆ ప్యానల్‌లో ఉండటం నచ్చలేదు’ అంటూ బండ్ల గణేశ్ తొలుత గొంతెత్తాడు.
అక్కడికి కాసేపటికి ప్యానల్ నుండి బయటికొచ్చి, ఆమె పోటీ చేస్తున్న జనరల్ సెక్రటరీ పదవికకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు విష్ణు ప్యానల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జీవితను టార్గెట్ చేస్తూ… పృథ్వీ ఫిర్యాదులు చేశారు. ఈసారి ఆయన ఏకంగా ఎన్నికల అధికారికే ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎన్నికల నియమావళిని జీవి ఉల్లంఘించారంటూ పృథ్వీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘మా’ కార్యాలయాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఆమె వాడుకుంటున్నారని, ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న ఆమె… మళ్లీ అదే పదవికి పోటీ చేస్తూ తాత్కాలిక సభ్యత్వ కార్డులు ఉన్న వారిని ప్రలోభ పెడుతున్నారని పృథ్వీ అంటున్నారు. జీవితపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పృథ్వీ డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది. ఈ కంప్లైంట్ పాలిటిక్స్ ఎక్కడివరకు వెళ్తాయి అనేది చూడాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!