Veera Simha Reddy: ఆ కన్ఫ్యూజన్ వీరసింహారెడ్డికి ప్లస్ అవుతుందా?

సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న వీరసింహారెడ్డి మూవీ అఖండను మించిన హిట్ కాబోతుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరసింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఏకంగా 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లోనే ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండు లుక్స్ లో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్

ఈ సినిమాతో కూడా అంతకు మించి మెప్పిస్తారని ఆ విషయంలో సందేహం అవసరం లేదని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం మామూలుగా ఉండవని అర్థమవుతోంది. సాయిమాధవ్ బుర్రా పనితనం ఏంటో ట్రైలర్ ద్వారానే అర్థమవుతోంది. అఖండ సక్సెస్ ఇచ్చిన జోష్ లో బాలయ్య ఈ సినిమా కోసం మరింత కష్టపడి నటించారు. అయితే ట్రైలర్ లో కథ గురించి ఏ మాత్రం స్పష్టత లేదు. పెద్ద బాలయ్య పాత్ర విదేశాలకు ఎందుకు వెళుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

అయితే ఈ కన్ఫ్యూజన్ సినిమాకు ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్, హనీ రోజ్ నటించగా శృతి హాసన్ రోల్ ఒకింత కామెడీ టచ్ తో ఉండనుందని సమాచారం అందుతోంది. శృతి హాసన్, హనీ రోజ్ లకు ఈ సినిమా కచ్చితంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ సాధించి బాలయ్య బాక్సాఫీస్ కు మరోసారి తన మాస్ పవర్ ను చూపించబోతున్నారని సమాచారం అందుతోంది. వీరసింహారెడ్డి ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus