టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే కొంతకాలం క్రితం వరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించారు. అయితే ఈ ఏడాది పూజా హెగ్డేకు ఏ మాత్రం కలిసిరాలేదు. పూజా హెగ్డే ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అవుతుండటంతో ఆమె కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వరుస ఫ్లాపులు పూజా హెగ్డే కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.
రాధేశ్యామ్, ఆచార్య సినిమాల ఫలితాలు పూజా హెగ్డేకు వరుసగా షాకిచ్చాయి.
కమర్షియల్ గా ఈ సినిమాలు ఏ స్థాయిలో నష్టాలను మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమా కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచి అందరికీ షాకిచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస షాకులతో డీలా పడిన పూజా హెగ్డేకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరో షాక్ తగిలింది. సర్కస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకు అక్కడ కూడా భారీ షాక్ తగిలింది.
ఈ ఏడాది పూజా హెగ్డే ఏ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినా ఆ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం హాట్ టాపిక్ అవుతోంది. పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే పై స్థాయిలో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పూజా హెగ్డే రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటే మంచిది. వరుస డిజాస్టర్ల వల్ల పూజా హెగ్డేకు సినిమా ఆఫర్లు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సక్సెస్ సాధిస్తేనే సౌత్ లో ఈ బ్యూటీకి కొత్త సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస ఫ్లాపుల గురించి పూజా హెగ్డే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పూజా హెగ్డే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి కళ్లు చెదిరే రికార్డులను క్రియేట్ చేయాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు. గతేడాది వరకు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?