గడిచిన ఏడాది కాలంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండటంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్న సంగతి తెలిసిందే. తారక్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో వరుస శుభవార్తలు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అమెరికాకు పయనమైన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై తారక్, చరణ్ డ్యాన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్30 మూవీ నుంచి జాన్వీ కపూర్ లుక్ రిలీజైంది.
జాన్వీని కొత్త లుక్ లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. జాన్వీ కపూర్ పోస్టర్ తో సినిమాపై హైప్ ఊహించని రేంజ్ లో పెరిగింది. అన్నీ మంచి శకునములే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి హీరోలకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా ఎన్టీఆర్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదగడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు.
ఎన్టీఆర్ తో సినిమా అంటే డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. అయితే తారక్ మాత్రం కొత్త ప్రాజెక్ట్ లేవీ ప్రకటించడం లేదు. తారక్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ టార్గెట్ గా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో అయ్యే దిశగా తారక్ అడుగులు పడుతున్నాయి. తారక్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమాను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాలి.
వరుస సినిమాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కథ నచ్చితే జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్స్ లో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్30 పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.