ఎన్టీఆర్ (Jr NTR) పై నాగార్జున (Nagarjuna) పైచేయి సాధించడం ఏంటి? అని అందరూ ఒకింత కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని సినిమా అంటే రూ.400 కోట్లు వసూళ్లు వస్తాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ‘దేవర’ (Devara) కూడా ఆ విషయాన్ని భారీ ఓపెనింగ్స్ తో ప్రూవ్ చేసింది. మరోపక్క నాగార్జున సరైన హిట్టు లేక.. దాదాపు 8 ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నారు.
‘బంగార్రాజు’ (Bangarraju) ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) వంటి హిట్స్ పడ్డా… అవి భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది లేదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ పై నాగార్జున ఎలా పై చేయి సాధిస్తారు? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకునేది వీళ్ళు హీరోలుగా నటించే సినిమాల గురించి కాదు. పక్క భాషల సినిమాల్లో వీరు చేస్తున్న కీలక పాత్రల గురించి. అవును ఎన్టీఆర్ హిందీలో తెరకెక్కిన ‘వార్ 2’ లో (War 2) కీలక పాత్ర చేశాడు.
ఒక రకంగా ఇది విలన్ షేడ్స్ ఉన్న పాత్ర. మరోపక్క నాగార్జున.. రజినీకాంత్ (Rajinikanth) ‘కూలి’ లో (Coolie) ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఇది కూడా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అని టాక్ వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ 2 సినిమాలు ఆగస్టు 14 నే రిలీజ్ కాబోతున్నాయి. ఇటీవల వచ్చిన ‘వార్ 2’ టీజర్ అంత బజ్ క్రియేట్ చేయలేదు. ఎన్టీఆర్ లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి.
యూట్యూబ్ లో ఈ టీజర్ కి వ్యూయర్షిప్ కూడా ఎక్కువగా రాలేదు. మరోపక్క ‘కూలీ’ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం రూ.40 కోట్లు కోట్ చేశారట. ఎన్టీఆర్ కి డైయార్డ్ ఫ్యాన్ అయ్యుండి కూడా ఆ సినిమాని కాదు అని.. ‘కూలి’ రైట్స్ కోసం ఆయన ఆరాటపడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు.